![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -408 లో.. అపర్ణని కావ్య రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అసలేం తప్పు చేసారని ఇంట్లో నుండి వెళ్లిపోతున్నారంటూ నీలదీస్తుంది. సరే నేనేం తప్పు చెయ్యలేదు.. నేను ఇంట్లో ఉంటాను కానీ దేని గురించి అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకున్నానో అది నువ్వు బయటపెడతావా ఆ బాబు కన్నతల్లిని తీసుకొని వస్తావా అని అపర్ణ అడుగుతుంది. నేను తీసుకొని వస్తానని కావ్య చెప్తుంది. ఆ బాబు తల్లి ఎక్కడున్నా మీ ముందు ఉంచుతానని అపర్ణతో కావ్య అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు.
ఆ తర్వాత కావ్య, రాజ్ లు గదిలోకి వెళ్తారు. నువ్వు ఏం చేస్తున్నావ్ ఏమైనా అర్థం అవుతుందా అని కావ్యపై రాజ్ సీరియస్ అవుతాడు. మరి ఏం చెయ్యమంటారు.. అత్తయ్యని ఇంట్లో నుండి వెళ్లకుండా ఆపాలంటే నాకు అంతకు మించి ఏం కన్పించలేదని కావ్య అంటుంది. అయిన ఆ బిడ్డ తల్లి ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుంది కదా ఎక్కడ ఉన్నా ఆ బిడ్డ తల్లిని తీసుకొని వస్తాను. మీరు అడ్డురాకండి అంటు కావ్య అక్కడ నుండి బయటకు వస్తుంటే.. సుభాష్ ఎదరుపడతాడు. సుభాష్ నిజం చెప్పబోతుంటే.. నాకు అంతా తెలుసు మావయ్య అందుకే మిమ్మల్ని చెప్పకుండా ఆపానని అనగానే సుభాష్ షాక్ అవుతాడు. ఈ విషయం నాకు తెలుసు అన్నట్టు మీ అబ్బాయికి చెప్పకండి అంటూ కావ్య చెప్తుంది. ఆ తర్వాత మనం ఏ ప్లాన్ చేసిన ఫెయిల్ అవుతుందని రుద్రాణితో రాహుల్ మాట్లాడతాడు. మరొకవైపు కావ్య ఆలోచిస్తుంటే ఇందిరాదేవి వస్తుంది. నువ్వేం చేస్తున్నావ్? ఆ బిడ్డ తల్లిని తీసుకొని వస్తానని మీ అత్తయ్యతో చెప్పావ్.. అలా చేస్తే ఇంట్లో నీ పరిస్థితేంటి.. అసలు అదేం తల్లి.. బాబుని ఇన్ని రోజులు వదిలేసి ఉంటుందా అని ఇందిరాదేవి అనగానే.. అవును ఇన్నిరోజులు వదిలిపెట్టి ఉంటుందా అని అనుకుంటూ.. థాంక్స్ మంచి ఐడియా ఇచ్చినందుకని కావ్య ఇందిరదేవితో చెప్పి వెళ్తుంది.
ఆ తర్వాత అనామిక అందంగా రెడీ అయి.. ఎలాగైనా కళ్యాణ్ నేను చెప్పినట్టు వినేలా చేసుకోవాలి. మా డాడ్ కి డబ్బులు ఇప్పించాలని అనుకుంటుంది. అప్పుడే కళ్యాణ్ గదిలోకి రాగానే.. అతని చెయ్యి పట్టుకుంటుంది. దాంతో కళ్యాణ్ చిరాకు పడుతూ చెయ్యి తీసేస్తాడు. తరువాయి భాగంలో ఇన్ని రోజులు బాబుని వదిలేసి వాళ్ళ అమ్మ ఎందుకు ఉందని సుభాష్ ని కావ్య అడుగుతుంది.. డబ్బు కోసమని.. నేనే డబ్బులు పంపిస్తానని సుభాష్ అనగానే.. డబ్బులు పంపించే అకౌంట్ నంబర్ డీటెయిల్స్ ఇవ్వండి.. ఆ బాబు తల్లి ఎక్కడుందో కనిపెడుతానని కావ్య అనగానే.. సుభాష్ సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |